Ab ladna hai: యాసిడ్ దాడి బాధితులకు అండగా దీపిక ‘అబ్ లడ్నా హై’ ఉద్యమం

  • యాసిడ్ దాడి బాధితుల్లో స్థైర్యాన్ని పెంచేందుకే ఈ ఉద్యమం
  • అబ్ లడ్ నా హై  అనేది మార్పునకు పునాదన్న దీపిక  
  • ఇందుకు సంబంధించి వీడియోను విడుదల చేసిన నటి

దేశంలో యాసిడ్ దాడులకు గురైన బాధితులకు మద్దతుగా నిలవాలని బాలీవుడ్ నటి దీపిక పదుకొనే ముందుకు సాగుతోంది. తాజాగా ఆమె వారిలో స్థైర్యం నింపడానికి ‘అబ్ లడ్నా హై’ పేర ఉద్యమాన్ని ప్రారంభించింది. కాగా, ఓ యాసిడ్ బాధితురాలి నిజ జీవితం ఆధారంగా దీపిక నిర్మించి, నటించిన ‘ఛపాక్’ చిత్రం వచ్చేనెల 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. తన సహనటుడు విక్రాంత్ మాసేతో కలసి ఉద్యమ ప్రచార గీతం వీడియోను దీపిక విడుదల చేసి తన చిత్తశుద్ధిని చాటుకుంది.

ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. అబ్ లడ్ నా హై  అనేది మార్పునకు పునాది వేయడమని పేర్కొంది. ఈ వీడియోలో యాసిడ్ దాడి బాధితులకు సంబంధించిన విషయాలను చిత్రీకరించారు. మిగతావారిలాగే సాధారణ జీవితం గడుపుతున్న బాధితుల జీవితాన్ని ఇందులో ప్రదర్శించారు. ప్రముఖ గీత రచయిత గుల్జార్ బాధితులకు ప్రేరణ కలిగించే పాటను రాయగా.. దాన్ని ఈ వీడియోలో చేర్చారు. ఈ గీతం మనసులో దాచుకోవాల్సిన కవితాత్మక భావన అని దీపిక తెలిపింది.

More Telugu News