ఈ నెల 30న ‘జనసేన’ విస్తృత స్థాయి సమావేశం

  • మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం
  • ఆ రోజు ఉదయం 11 గంటలకు భేటీ
  • పలు అంశాలపై చర్చించనున్న ‘జనసేన’ నేతలు
జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఈ నెల 30వ తేదీన నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం అవుతుందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు - రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు - ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత, జనసేన స్టాండ్, పార్టీ పరంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపింది. ఈ సమావేశంలో జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు పాల్గొంటారని పేర్కొంది.
Go Back to Shorts
Janasena party
Vijayawada
Amaravathi
Farmers

More Telugu News