Devineni Uma: 700 ఏళ్ల తర్వాత తుగ్లక్ మళ్లీ వచ్చాడు.. అతడి బారి నుంచి అమరావతిని కాపాడుకోవాలి: దేవినేని ఉమ
అమరావతిని కాపాడుకుందాం అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. 700 ఏళ్ల కిందట భారతదేశం తుగ్లక్ ను, అతడి పరిపాలనను చూసిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఆ పిచ్చి తుగ్లక్ వచ్చాడని, భావితరాల కోసం 700 ఏళ్ల తర్వాత వచ్చిన అతడి బారి నుంచి ప్రజారాజధాని అమరావతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు ఉమ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో పాల్గొన్నారు.