సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
- 4940 బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటన
- జనవరి 10 నుంచి 13వరకు ఈ సౌకర్యం
- ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉందని వెల్లడి
ఈ రోజు ఎంజీబీఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ అధికారులు ఈ మేరకు ప్రకటన చేశారు. పండగ రద్దీని తట్టుకునేందుకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లేవారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ బస్సుల్లో ప్రయాణించడానికి ముందుగా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా ఉందన్నారు.