రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ

26-12-2019 Thu 17:58
  • జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికపై చర్చ
  • భేటీ ఎక్కడ నిర్వహిస్తారనే అంశం వెల్లడి కాలేదు 
  • రైతుల అభిప్రాయాల సేకరణకు మంత్రి వర్గం ఉపసంఘం?

జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికపై చర్చించేందుకు రేపు ఏపీ కేబినెట్ భేటీ కానున్న విషయం తెలిసిందే. రేపు ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరగనుంది. మూడు రాజధానుల అంశంపై, కమిటీ సమర్పించిన నివేదికలోని వివిధ అంశాలపైనా, రాజధానికి భూములిచ్చిన రైతుల అంశంపైనా చర్చించనున్నట్టు సమాచారం. రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాల సేకరణ నిమిత్తం మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాజధాని రైతుల నిరసనల కారణంగా కేబినెట్ భేటీని సచివాలయంలో నిర్వహిస్తారా? లేక తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోనా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.