Narendra Modi: మేఘాల కారణంగా గ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయా: ప్రధాని మోదీ

  • కోజికోడ్ లో సూర్యగ్రహణాన్ని వీక్షించిన మోదీ
  • అందరి మాదిరే ఉత్సాహంగా వీక్షించానని ట్వీట్
  • నిపుణులను అడిగి గ్రహణం గురించి తెలుసుకున్నా
సూర్యగ్రహణాన్ని ప్రధాని మోదీ వీక్షించారు. ప్రస్తుతం కేరళలోని కోజికోడ్ లో ప్రధాని ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఎంతో మంది భారతీయుల మాదిరే తాను కూడా ఉత్సాహంగా గ్రహణాన్ని వీక్షించానని చెప్పారు. అయితే, మేఘాల కారణంగా గ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయానని తెలిపారు. గ్రహణం గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా పెద్దలతో పాటు పిల్లలు కూడా భారీ సంఖ్యలో ఈ గ్రహణాన్ని వీక్షించారు. గ్రహణాన్ని వీక్షించేందుకు హైదరాబాదులోని బిర్లా ప్లానెటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేశారు.
Narendra Modi
Solar Eclipse
BJP

More Telugu News