pk: ఇది కేవలం విరామం మాత్రమే.. ఫుల్‌స్టాప్ మాత్రం కాదు: ఎన్నార్సీపై ప్రశాంత్ కిశోర్
- సీఏఏపై మరోసారి మండిపాటు
- నిరసనలు తగ్గించేందుకే ఎన్‌ఆర్‌సీపై చర్చ ఉండదని కేంద్రం ప్రకటన
- సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేవరకు కేంద్ర ప్రభుత్వం వేచి చూడాలి
ఎన్డీఏ ప్రభుత్వంపై జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు తగ్గించేందుకే ఎన్‌ఆర్‌సీపై చర్చ ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని ఆయన ఆరోపించారు. ఇది కేవలం విరామం మాత్రమేనని, ఫుల్‌స్టాప్ మాత్రం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేవరకు కేంద్ర ప్రభుత్వం వేచి చూడాలని ప్రశాంత్ కిశోర్ కోరారు. న్యాయస్థాన తీర్పునకు అనుగుణంగా మొత్తం ప్రక్రియ మొదటికి వస్తుందని ట్వీట్ చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆయన మొదటి నుంచి విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే.