రేపు రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల భేటీ

25-12-2019 Wed 21:13
  • తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో రేపు మధ్యాహ్నం సమావేశం
  • మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనపై చర్చ
  • రైతులకు భరోసా కల్పించేందుకే ఈ భేటీ అంటున్న నేతలు

ఏపీకి మూడు రాజధానుల అంశంపై ప్రతిపక్షాలు, రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రేపు భేటీ కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో రేపు మధ్యాహ్నం సమావేశం కానున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికపై చర్చించనున్నట్టు సమాచారం. రైతులకు భరోసా కల్పించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు వైసీపీ వర్గాల సమాచారం. సమావేశం అనంతరం ప్రభుత్వ ప్రణాళికలను వివరించనున్నట్టు తెలుస్తోంది.