చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుప్పం వైసీపీ నేతలు

24-12-2019 Tue 13:10
  • ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి చంద్రబాబు రాలేదు
  • నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు
  • కుప్పం గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడటం లేదు

టీడీపీ అధినేత చంద్రబాబుపై కుప్పం నియోజకవర్గ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఒక్కసారి కూడా రాలేదని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. చంద్రబాబును తమకు కనిపించేలా చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ నియోజకవర్గం గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడటం లేదని అన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే తమకు అవసరం లేదని చెప్పారు.