Akhil: అఖిల్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ హైలైట్!

  • 'బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • తదుపరి సినిమా పరశురామ్ తో

అఖిల్ .. పూజా హెగ్డే జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. అఖిల్ - పూజా హెగ్డే లవ్ ట్రాక్ లో ఓ నాలుగు కీలకమైన సన్నివేశాలు ఉంటాయట. ఈ రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఈ సీన్స్ చాలా బాగా వచ్చాయనేది యూనిట్ సభ్యుల మాట. భాస్కర్ ఈ సన్నివేశాలను హార్ట్ ఫుల్ గా చిత్రీకరించాడనీ, యూత్ కి ఈ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ఇక దేవిశ్రీ పాటలు కూడా ఈ సినిమాకి ప్రాణంగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాతో అఖిల్ కి హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తరువాత 'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ తో కలిసి అఖిల్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టుపై కూడా అంచనాలు బాగానే వున్నాయి.

More Telugu News