ఆ సినిమా నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు: సీనియర్ హీరోయిన్ కవిత

23-12-2019 Mon 17:04
  • తమిళంలో తొలి సినిమా చేశాను
  • నాలుగు భాషల్లో నటించాను 
  • తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారన్న కవిత

తాజా ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ కవిత మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విషయాలను గురించి ప్రస్తావించారు. పదకొండేళ్ల వయసులో నేను చిత్రపరిశ్రమలోకి వచ్చాను. దర్శకుడు శ్రీధర్ గారు ఒక తమిళ సినిమా ద్వారా నన్ను పరిచయం చేశారు. తెలుగులో నేను చేసిన మొదటి సినిమా 'సిరి సిరి మువ్వ'.

అయితే తెలుగులోకి కథానాయికగా నన్ను పరిచయం చేసింది కూడా శ్రీధర్ గారే. 'సీత గీత దాటితే' అనే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమయ్యాను. ఆ సినిమా నుంచి ఇక నేను వెనుదిరిగి చూసుకోలేదు. కూతురిగా .. చెల్లెలిగా ఓ 28 సినిమాలు చేసి వుంటాను. హీరోయిన్ గా తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో 135 సినిమాల వరకూ చేశాను. తెలుగు ప్రేక్షకుల ఆదరణ కారణంగా ఇక్కడ నేను ఎక్కువ సినిమాలు చేశాను. వాళ్లందరికీ నేను ఎంతో రుణపడి వున్నాను" అని చెప్పుకొచ్చారు.