Shivsena: మరో రాష్ట్రాన్ని కోల్పోయారు.. ఆత్మపరిశీలన చేసుకోండి: శివసేన

  • సీఏఏతో బీజేపీకి ఒరిగిందేమీలేదన్న సంజయ్ రౌత్
  • మహారాష్ట్ర తర్వాత ఝార్ఖండ్ ను బీజేపీ కోల్పోయింది
  • మోదీ, అమిత్ షా సర్వశక్తులను ఒడ్డినా ఫలితం లేకపోయింది
మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన బీజేపీకి... ఈరోజు వెలువడుతున్న ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీని శివసేన మరోసారి టార్గెట్ చేసింది. పౌరసత్వ సవరణ చట్టంతో బీజేపీకి ఒరిగిందేమీ లేదని... ఆ పార్టీ మరో రాష్ట్రాన్ని కోల్పోయిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఝార్ఖండ్ ను బీజేపీ ఐదేళ్లు పాలించిందని... మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సర్వశక్తులను ఒడ్డారని చెప్పారు. మోదీ పేరు చెప్పుకుని ఓట్లను రాబట్టుకునేందుకు యత్నించిన బీజేపీ బోర్లా పడిందని అన్నారు. మహారాష్ట్ర ఓటమి తర్వాత ఝార్ఖండ్ ను కూడా ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందో బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు.
Shivsena
Sanjay Raut
BJP
Narendra Modi
Amit Shah

More Telugu News