Kavitha: నా సినిమాల విడుదల సమయంలో భయపడేదానిని: సీనియర్ హీరోయిన్ కవిత

  • పదకొండేళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను 
  • సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించాను 
  • గర్వంగా ఉంటుందన్న కవిత  
తెలుగులో ఒక వెలుగు వెలిగిన నిన్నటి తరం కథానాయికలలో కవిత ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "నేను 11 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను. చాలా సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించాను. సీనియర్స్ అయినప్పటికీ వాళ్ల పట్ల నాకు గౌరవమేగానీ భయం ఉండేది కాదు. అయితే ఒక విషయంలో మాత్రం నేను భయపడేదానిని.

జయసుధ .. జయప్రద .. శ్రీదేవి స్టార్ హీరోయిన్స్. ఆ సమయంలో నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను. వాళ్ల సినిమాల విడుదల సమయాల్లో, నేను హీరోయిన్ గా చేసిన సినిమాలు విడుదలవుతుంటే మాత్రం భయపడేదానిని. అయితే అదృష్టం కొద్దీ నా సినిమాలు కూడా సక్సెస్ అయ్యేవి. అలాంటి తారలకు పోటీగా నిలిచి విజయాన్ని సాధించినందుకు నాకు ఇప్పటికీ గర్వంగానే ఉంటుంది. ఆ ముగ్గురు హీరోయిన్స్ కి నేను అంటే చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చారు.
Kavitha

More Telugu News