Maharashtra: రైతులకు రుణమాఫీ ప్రకటించిన ‘మహా‘ సీఎం ఉద్ధవ్

  • ఒక్కో రైతుకు గరిష్ఠంగా రూ.2లక్షల వరకు రుణమాఫీ
  • మహాత్మా జ్యోతిరావ్ పూలే పేరుతో అమలు
  • రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి షరతులు విధిస్తారా?: బీజేపీ

ఇటీవల మహారాష్ట్రలో కొలువుదీరిన ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పలు పథకాలతో ముందుకు దూసుకుపోతోంది. తాజాగా సీఎం ఉద్ధవ్ రైతులకు ఊరట కల్పిస్తూ రుణమాఫీపై ప్రకటన చేశారు. 2019 సెప్టెంబర్ 30వరకు ఉన్న పంట రుణాలపై ఒక్కో రైతుకు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు.

మహాత్మా జ్యోతిరావ్ పూలే పేరుతో ఈ రుణ మాఫీ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు విధించడం సరికాదని విమర్శించింది. ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ.. ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సహా పార్టీకి చెందిన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

More Telugu News