జీఎన్ రావు కమిటీకి ఏ అర్హత ఉందని వారి నిర్ణయాలు పరిగణనలోకి తీసుకోవాలి?: సీపీఐ నారాయణ
- గుంటూరులో సీపీఐ వార్షికోత్సవ సభ
- హాజరైన నారాయణ
- ఏపీ రాజధాని మూడు ముక్కలాట కాకూడదని వ్యాఖ్యలు
గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఉండాలని మొదటి నుంచి తాము కోరుతున్నామని అన్నారు. అసలు, రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీకి అర్హత ఉందా? అని నారాయణ ప్రశ్నించారు. కమిటీకి ఏ అర్హత ఉందని వారి నిర్ణయాలు పరిగణనలోకి తీసుకోవాలని నిలదీశారు. జీఎన్ రావు కమిటీ నివేదికను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో ఉండాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెప్పారు.