రాజధానుల విషయంలో సీఎం స్పష్టత ఇవ్వకుండా అభిప్రాయం మాత్రమే చెప్పారు: సీపీఐ అగ్రనేత డి.రాజా
- గుంటూరులో సీపీఐ 95వ వార్షికోత్సవం
- పాల్గొన్న అగ్రనేతలు
- రాజధానిపై సీపీఐ కూడా అధ్యయనం చేస్తుందన్న రాజా
ఏపీ రాజధానుల అంశంలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వకుండా కేవలం అభిప్రాయం చెప్పారని పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై చర్చ జరగడమే కాకుండా, మరింత అధ్యయనం జరగాలని తెలిపారు. ఇది ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చించాల్సిన విషయమని రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీపీఐ కూడా అధ్యయనం చేస్తుందని వెల్లడించారు. అయితే, అమరావతికి భూములు ఇచ్చిన అంశం వేరు, మూడు రాజధానుల అంశం వేరని అన్నారు.