పౌరసత్వ చట్టంపై ప్రభుత్వం స్పందన.. భారతీయులుగా గుర్తింపబడేదెవరో చెప్పిన కేంద్రం!
- పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు
- 1 జులై 1987 ముందు దేశంలో జన్మించిన వారంతా భారతీయులే
- తల్లిదండ్రుల్లో ఒకరు భారత్‌లో జన్మించితే పౌరసత్వం
1 జులై 1987కు ముందు దేశంలో జన్మించిన వారితోపాటు, ఎవరి తల్లిదండ్రులైనా ఆ తేదీకి ముందు దేశంలో జన్మించి ఉంటే వారికి పౌరసత్వం లభిస్తుందని, వారంతా భారతీయులుగా గుర్తింపబడతారని స్పష్టం చేసింది. అలాగే, 2004 పౌరసత్వ చట్టం ప్రకారం దేశంలోని ఎవరి తల్లిదండ్రులైనా ఒకరు భారతీయులు అయి ఉండి, మరొకరు శరణార్థి అయినప్పటికీ వారు భారతీయులే అవుతారని వివరించింది. అయితే, ఇది అసోంలోని వారికి మాత్రం వర్తించదని స్పష్టం చేసింది.