Richa Gangopadhyay: నా పెళ్లి జరిగి మూడు నెలలు అవుతోంది: రిచా గంగోపాధ్యాయ్

  • తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న రిచా
  • కొన్ని సినిమాలతోనే ఇండస్ట్రీకి గుడ్ బై
  • అమెరికాలో బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి
టాలీవుడ్ లో మిరపకాయ్, మిర్చి వంటి చిత్రాలతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న రిచా గంగోపాధ్యాయ్ చాలాకాలం కిందటే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇటీవలే ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోలు మీడియాలో ప్రముఖంగా దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో రిచా తన పెళ్లిపై స్పందించింది. అమెరికన్ బాయ్ ఫ్రెండ్ తో తన వివాహం జరిగి మూడు నెలలు అవుతోందని వెల్లడించింది. కొన్ని మీడియా వర్గాలు రహస్య వివాహం అంటూ కథనాలు వెలువరించడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇందులో దాపరికం ఏమీ లేదని, ఇరువురి కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నానని తెలిపింది. కానీ రహస్య వివాహం అని రాయడం వెనుక మతలబు ఏంటో తెలియడంలేదని వ్యాఖ్యానించింది. ఎంబీఏలో తామిద్దరం క్లాస్ మేట్స్ అని, సెకండియర్ వరకు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదని, లైఫ్ పార్ట్ నర్ పక్కనే ఉన్నా గుర్తించలేకపోయానని వివరించింది.
Richa Gangopadhyay
USA
Tollywood

More Telugu News