Venkatesh: నేను చైతన్యతో కలిసి నటించాలన్నది మా నాన్న కోరిక: వెంకటేశ్

  • ఇటీవలే విడుదలైన వెంకీ మామ
  • హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం
  • విజయవాడలో సక్సెస్ మీట్
వెంకీమామ చిత్రంతో తన తండ్రి రామానాయుడు కోరిక నెరవేర్చానని సీనియర్ హీరో వెంకటేశ్ తెలిపారు. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటించిన వెంకీమామ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో చిత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నాగచైతన్యతో కలిసి హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ, నేను చైతన్యతో కలిసి నటించాలన్నది తన తండ్రి రామానాయుడు కోరిక అని, ఈ సినిమాతో తండ్రి కోరిక తీర్చగలిగానని వెల్లడించారు. చైతన్యతోనే కాదని, ఇతర హీరోలతో కలిసి నటించేందుకు కూడా తనకు అభ్యంతరం లేదని వెంకీ స్పష్టం చేశారు. గతంలో మహేశ్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశానని తెలిపారు.
Venkatesh
Nagachaithanya
Venky Mama
Tollywood
Vijayawada

More Telugu News