Chiranjeevi: డియర్ చిరంజీవి గారూ.... ఆనందం పట్టలేకపోతున్నాం సర్: మహేశ్ బాబు

  • జనవరి 5న 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఎల్బీ స్టేడియం వేదికగా ముందస్తు సంబరం
  • ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. జనవరి 5న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో, హీరో మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. డియర్ చిరంజీవి గారూ, మా ఆహ్వానాన్ని మన్నించి 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు వస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.

"మేం పిలవగానే ఎంతో వినమ్రంగా అంగీకరించారు. మా వేడుకల్లో  పాలుపంచుకోవడానికి మీరు వస్తుండడంతో సంతోషం పట్టలేకపోతున్నాం. మీ రాకతో మా ఆనందం రెట్టింపవుతుంది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది సర్" అంటూ మహేశ్ బాబు పోస్టు చేశారు.
Chiranjeevi
Mahesh Babu
Sarileru Neekevvaru
Tollywood
Pre Release Event

More Telugu News