nagababu: చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను వైసీపీ సర్కారు అమలు చేయాల్సిందే: నాగబాబు

  • మందడంలో రైతుల దీక్షకు సంఘీభావం  
  • రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతుల ఇబ్బందులు
  • అమరావతిలో రాజధానిని యథాతథంగా కొనసాగించాలి
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై అమరావతి రైతులు దీక్షకు దిగిన విషయం తెలిసిందే. మందడంలో జనసేన నేత, సినీనటుడు నాగబాబు రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు తమ కుటుంబాలతో పాటు రోడ్డుపైకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి తాను మద్దతు తెలుపుతున్నానని చెప్పారు.

అమరావతిలో రాజధానిని యథాతథంగా కొనసాగించాలన్నదే జనసేన డిమాండ్ అని నాగబాబు తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలను వైసీపీ సర్కారు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల కష్టాల పరిష్కారం కోసం పోరాడేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు.
nagababu
YSRCP
Jana Sena

More Telugu News