Buddhavenkanna: డైరెక్ట్ గా రాజధాని ప్రాంతంలోనే చర్చించుకుందాం.. సమయం, తేదీ మీరే నిర్ణయించండి: బుద్ధా వెంకన్న

  • అధికారంలోకి వచ్చిన 7 నెలల తరువాత కూడా పాత ఏడుపులేనా? 
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే ట్వీట్లు మానండి
  • జగన్ గారికి దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలు బయటపెట్టండి 
అమరావతిలో రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టు, ఇంకా ఏదయినా ప్రకటనకు ముందే తన వాళ్లకు సమాచారం ఇచ్చి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇన్ సైడర్ ట్రేడింగుకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 'అయ్యా విజయసాయి రెడ్డి గారూ.. అధికారంలోకి వచ్చిన 7 నెలల తరువాత కూడా పాత ఏడుపులేనా? అమరావతిలో వేల ఎకరాలు  ఇన్ సైడర్  ట్రేడింగ్ అని ట్వీట్లు మాని మీకు, జగన్ గారికి దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలు బయటపెట్టమనండి' అని సవాలు విసిరారు.
 
'ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు బురద చల్లడం ఒక్కటే మీ పని అనుకుంటే మీ ఇష్టం విజయసాయిరెడ్డి గారూ' అంటూ బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయసాయి రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ట్విట్టర్ వేదికగా కాదు డైరెక్ట్ గా రాజధాని ప్రాంతంలోనే చర్చించుకుందామని, సమయం, తేదీ మీరే నిర్ణయించండని సవాలు విసిరారు.
Buddhavenkanna
Andhra Pradesh
YSRCP

More Telugu News