Chandrababu: ఇకనైనా మీ శాంతివచనాలు పక్కనబెట్టి మా బాధలు చూసి దాని ప్రకారం వ్యవహరించండి: చంద్రబాబు ముందు బాధను వ్యక్తం చేసిన జేసీ

  • చంద్రబాబు అనంతపురం పర్యటన
  • జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • వేదికపైనే చంద్రబాబుకు క్లాస్!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబుతోపాటు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలతో హోరెత్తించారు. వేదికపై చంద్రబాబు ఆసీనులై ఉండగా, ఏకంగా ఆయన్నే విమర్శిస్తూ జేసీ ప్రసంగం కొనసాగింది.

"ఎన్నికల ముందు ఎమ్మెల్యేలందరినీ మార్చాలని చెప్పినా వివిధ కారణాలతో మీరు మార్చలేకపోయారు. ఈ విషయంలో నా పాత స్నేహితులు (వైఎస్సార్?) వేలరెట్లు మేలు. వాళ్లకు సెల్యూట్ చేస్తున్నాను. ఇవాళ నేను అభిమానులతో చప్పట్లు కొట్టించుకునేందుకు ఇక్కడికి రాలేదు. ఏంది ఈయన... ఎప్పుడూ శాంతి వచనాలు, శాంతి వచనాలు అంటారు. నువ్వు శాంతివచనాలు చెప్పి మమ్మల్ని చంక నాకించావ్. ఇకనైనా మీ శాంతివచనాలు పక్కనబెట్టి మా బాధలు చూసి దాని ప్రకారం వ్యవహరించండి. అధికారందేముంది త్వరలోనే వస్తుంది. నాకు గట్టినమ్మకం ఉంది... రెండున్నరేళ్లలోనే ఎలక్షన్స్ వస్తాయి. కానీ మీరు మాత్రం "నేను శాంతివచనాలే చెబుతాను, నేను గాంధీ తరహా" అంటూ మాత్రం మాట్లాడొద్దు.

 ఇందాక ఎవడో చెప్పాడు, వాళ్లది బాగాలేదు, మనది బ్రహ్మాండంగా ఉందన్నాడు. ఏంది సార్ బ్రహ్మాండంగా ఉండేది... ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్లు మాత్రమే ఈ ప్రభుత్వం బాగాలేదని చెబుతారు, కాయకష్టం చేసుకునేవాళ్లందరూ వాడి ప్రభుత్వమే బాగుందంటున్నారు. వాడికో మంచిపేరు వచ్చింది... కరెక్ట్ టైముకు వస్తాడు, అరగంట మాట్లాడి బైబై చెప్పి వెళ్లిపోతాడని మంచి పేరొచ్చింది. కానీ మీరు మాతో ఎంత సేపు మాట్లాడారో చెప్పండి? ఎంతసేపూ అధికారులేనా! ఇకనైనా తప్పెట్లు, తాళాలకు మోసపోవద్దు" అంటూ హితబోధ చేశారు.

More Telugu News