Narendra Modi: మోదీ తెచ్చిన పవిత్ర జలాలను, పార్లమెంట్ మట్టిని ఏట్లో కలిపేస్తారేమో!: సోమిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర భవిష్యత్తు అర్థం కావడం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఏపీని సీఎం జగన్ దక్షిణాఫ్రికాతో పోల్చారని ఆయన అన్నారు. ఇంకా నయం మొజాంబిక్, కాంగో వంటి దేశాలతో పోల్చలేదని ఎద్దేవా చేశారు.

రాజధానిపై మొన్న రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడితే ఆయన భాష అర్థం కాలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు జగన్ మాట్లాడితే రాష్ట్ర భవిష్యత్తు అర్థం కావడం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెచ్చిన పవిత్ర జలాలను, పార్లమెంట్ మట్టిని ఏట్లో కలిపేస్తారేమో అని విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Narendra Modi
simireddy
Andhra Pradesh
Telugudesam

More Telugu News