Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి మేము కొత్తగా చేసే సూచన ఇది: కన్నా లక్ష్మీనారాయణ

  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మా మేనిఫెస్టోలో ఉంది
  • హైకోర్టు బెంచ్ అమరావతిలో ఉంటే బాగుంటుంది
  • విధివిధానాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి
ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానుల గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ విషయమై తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, జగన్ తన ఆలోచనా విధానం గురించి చెప్పారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, సీడ్ క్యాపిటల్ అమరావతిలో ఉండాలని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉందని, ఆ రకంగా జరిగితే సమర్థిస్తామని చెప్పారు. విధివిధానాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. హైకోర్టు బెంచ్ అమరావతిలో ఉంటే బాగుంటుందని, ఏపీ ప్రభుత్వానికి తాము కొత్తగా చేసే సూచన ఇదని అన్నారు.
Andhra Pradesh
CM
Jagan
Kanna lakshmi narayana

More Telugu News