Four Years Girl Kidnap: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక కిడ్నాప్

  • దిశ ఘటన జరిగిన చటాన్ పల్లిలో ఘటన
  • చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేసిన దుండగుడు
  • తోటి పిల్లలు తల్లిదండ్రులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు
దిశ ఘటన జరిగిన చటాన్ పల్లి గ్రామంలో.. నాలుగేళ్ల బాలిక కిడ్నాపయిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయంపై పోలీసులు చెబుతూ, గ్రామంలో మేస్త్రీగా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి కుమార్తె స్నేహిత షాద్ నగర్ పబ్లిక్ స్కూల్ లో ఎల్ కేజీ చదువుతోందన్నారు. ఈ రోజు స్నేహిత పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి పాపకు చాక్లెట్ ఆశ చూపి తనతో తీసుకువెళ్లాడన్నారు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు ఇది గమనించి స్నేహిత తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు కిడ్నాపయిన బాలికకోసం గాలిస్తున్నారు.
Four Years Girl Kidnap
Incident occured Chatan Pally
Telangana

More Telugu News