Andhra Pradesh: ఏపీ మద్యం పాలసీపై మాటకు మాట!

  • వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం
  • పరస్పర విమర్శలు
  • మద్యం షాపులు తగ్గాయంటున్న మంత్రులు
  • అంతా వట్టిదేనంటున్న టీడీపీ నేతలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీకి మద్యపాన నిషేధం ఇష్టంలేదని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ నిర్ణయం కారణంగా రాష్ట్రంలో 20 శాతం మద్యం షాపులు తగ్గాయని అన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతలే మద్యం వ్యాపారులని తెలిపారు. టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారిందని అన్నారు.

అటు, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మద్యం షాపులు తగ్గాయన్నది వట్టి బూటకమని అన్నారు. మద్యం షాపులను ఏమీ తగ్గించలేదని, ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. పైగా రాష్ట్రంలో నాటుసారా ఎక్కువైందని తెలిపారు. నిమ్మల రామానాయుడు స్పందిస్తూ, రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ వైసీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోందన్నారు.

More Telugu News