Sensex: నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 70 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 32 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • రెండున్నర శాతానికి పైగా లాభపడ్డ సన్ ఫార్మా

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఒడిదుడుకుల్లోనే కొనసాగిన మార్కెట్లు... చివరి అరగంటలో అప్పటి వరకు ఉన్న కాస్త లాభాలను కూడా పోగొట్టుకున్నాయి. ఐటీ, టెక్, రియాల్టీ, యుటిలిటీస్, హెల్త్ కేర్ సూచీలు మినహా మిగిలినవన్నీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 70 పాయింట్లు నష్టపోయి 40,938కి పడిపోయింది. నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 12,053 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.70%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.65%), టెక్ మహీంద్రా (1.60%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.83%), కోటక్ మహీంద్రా (0.73%),    

టాప్ లూజర్స్:
ఐటీసీ (-1.97%), టాటా స్టీల్ (-1.80%), భారతి ఎయిర్ టెల్ (-1.37%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.35%), మారుతి సుజుకీ (-1.20%).

More Telugu News