ఉన్నావో అత్యాచారం కేసులో నేడు తుది తీర్పు!
- 2017లో బాలికపై అత్యాచారం
- ఈ ఏడాది ఆగస్టులో కేసు నమోదు
- రహస్యంగా విచారించిన ఢిల్లీ కోర్టు
ఈ కేసులో ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇదే కేసులో శశిసింగ్ అనే వ్యక్తిపైనా అభియోగాలు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈ కేసు యూపీ నుంచి ఢిల్లీ జిల్లా కోర్టుకి బదిలీ అయింది. ఈ కేసును రహస్యంగా విచారించిన ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ ఈ నెల 16న (నేడు) తీర్పు ఇవ్వనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.