India: వెస్టిండీస్ ముందు 288 పరుగుల టార్గెట్ ఉంచిన టీమిండియా

  • చెన్నైలో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసిన భారత్

చెన్నై వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మిడిలార్డర్ చలవతో భారీ స్కోరు నమోదు చేసింది. టాపార్డర్ లో రోహిత్ శర్మ 36 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (4), ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) విఫలమయ్యారు. దాంతో ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత స్వీకరించిన యువ జోడీ శ్రేయాస్ అయ్యర్ (70), రిషబ్ పంత్ (71) విలువైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు.

కేదార్ జాదవ్ కూడా తనవంతు పాత్ర సమర్థంగా పోషించి 40 పరుగులు చేశాడు. చివర్లో జడేజా (21) రనౌట్ గా వెనుదిరిగాడు. భారీ షాట్లు ఆడతాడని పేరున్న శివం దూబేను విండీస్ బౌలర్లు 9 పరుగులకే కట్టడి చేశారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, కీమో పాల్, అల్జారి జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా, కెప్టెన్ పొలార్డ్ కు ఓ వికెట్ దక్కింది.

More Telugu News