toll plaza: ఇక అంతా ఫాస్టాగ్...టోల్ గేట్ల వద్ద అమల్లోకి వచ్చిన విధానం

  • నిమిషాల్లో చెక్ పోస్టు దాటేయవచ్చు 
  • వేచి చూడడం, విసుగుకు అవకాశం లేదు 
  • ప్రతి టోల్‌ప్లాజా వద్ద ఒక లైన్ ఈస్టిక్కర్ వాహనాలకు కేటాయింపు

టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండే సమస్యకు చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ విధానం దేశవ్యాప్తంగా ఈరోజు అమల్లోకి వచ్చింది. దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ స్టిక్కర్ వాహనాల కోసం ఓ లైన్‌ కేటాయించాలని ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఆ లైన్‌ లో ఫాస్టాగ్ స్టిక్కర్ వాహనాలు ఎటువంటి చెల్లింపులు జరపకుండా 30 సెకన్ల నుంచి ఒక నిమిషంలోపు వెళ్లిపోవచ్చు. టోల్ గేట్లవద్ద రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరం (ఆర్‌ఎఫ్‌ఐడీ) ఆధారంగా ఈ విధానం పనిచేస్తుంది.

తొలుత ప్రకటించిన విధంగా ఈ విధానం ఈనెల 1 నుంచే అమలులోకి రావాల్సి ఉంది. వాహన చోదకుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని  కేంద్రం దీన్ని ఆదివారానికి పొడిగించింది.  ఫాస్టాగ్‌ లైన్లలో 25 వరుసలను హైబ్రీడ్‌ లైన్లుగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

హైబ్రీడ్‌ లైన్లు నెలరోజులపాటు కొనసాగుతాయి. ఈ నిబంధన మేరకు హైబ్రీడ్‌ లైన్లలోకి వెళ్లే ఫాస్టాగ్‌ రహిత వాహనదారుల నుంచి సాధారణ టోల్‌ వసూలు చేస్తారు.  ఆ తర్వాత ఫాస్టాగ్‌ లైన్‌లోకి వచ్చే ఇతర వాహనాలకు రెట్టింపు టోల్‌ ఉంటుంది.

More Telugu News