కాన్పూర్ వద్ద గంగానదిలో విహరించిన ప్రధాని నరేంద్ర మోదీ

14-12-2019 Sat 16:22
  • నమామి ప్రాజెక్టు సమావేశంలో పాల్గొనేందుకు కాన్పూర్ వచ్చిన మోదీ
  • గంగానది వద్ద స్వచ్ఛ భారత్ పనుల పరిశీలన
  • అటల్ ఘాట్ వద్ద బోటు షికారు
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ గంగా మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ విచ్చేశారు. ఇక్కడి చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో జరిగిన నమామి గంగా ప్రాజెక్టు గురించి ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం గంగానదిని పరిశీలించారు. అక్కడ అమలవుతున్న స్వచ్ఛ భారత్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం టీఎస్ రావత్, బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీలతో కలిసి ఇక్కడి అటల్ ఘాట్ వద్ద ఓ బోటులో గంగానది విహారం చేశారు. ఈ సందర్భంగా తీరంలో ఉన్నవారికి చేయి ఊపుతూ మోదీ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.