Ayesha meera: ఆయేషా మృతదేహానికి మరికాసేపట్లో రీపోస్టుమార్టం!

  • డిసెంబరు 2007లో హాస్టల్‌లో హత్యకు గురైన ఆయేషా 
  • 8 ఏళ్ల జైలు శిక్ష తర్వాత నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు
  • సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు

27 డిసెంబరు 2007లో హాస్టల్‌లో హత్యకు గురైన ఆయేషా మీరా మృతదేహానికి మరికాసేపట్లో రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇందుకోసం సీబీఐ అధికారులు, పోలీసులు తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికకు చేరుకున్నారు.

బీఫార్మసీ చదువుతూ విజయవాడ శివారులోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉన్న ఆయేషా దారుణ హత్యకు గురైంది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో సత్యంబాబును నిందితుడిగా పేర్కొంటూ 11 ఆగస్టు 2008న పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును విచారించిన విజయవాడ మహిళా సెషన్స్ ప్రత్యేక కోర్టు 2010లో సత్యంబాబుకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

అయితే, 31 మార్చి 2007లో సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో 8 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత సత్యంబాబు జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా, ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ 29 నవంబరు 2018న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు.

More Telugu News