ఏపీఎస్సార్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల కంటే డీజిల్ బస్సులే మేలు.. జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ సిఫారసులు
- ప్రస్తుతం ఈ బస్సుల అవసరం లేదు
- వీటి సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది
- లీజ్ ప్రాతిపదికన తీసుకోవడం సరికాదు
ఎలక్ట్రిక్ బస్సుల సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తి స్థాయిలో లేవని, వీటి సాంకేతికత పెరిగి బస్సుల ఉత్పత్తి పెరిగితే వాటి ధరలు బాగా తగ్గుతాయన్న విషయంతో పాటు ఈ బస్సులకు సంబంధించిన టెండర్లపై పలు అభ్యంతరాలు ఉన్నాయని, లీజ్ ప్రాతిపదికన తీసుకోవడం సరికాదని ఈ నివేదికలో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు పేర్కొన్నారు.