అమెరికాలో తెలుగు టెక్కీ బలవన్మరణం

  • ఆత్మహత్య చేసుకున్న చిత్తూరు జిల్లా యువకుడు
  • మృతుడు అమెజాన్ ఉద్యోగి
  • సమస్యలేవీ లేవంటున్న బంధువులు!
అమెరికాలో ఓ తెలుగు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాకు చెందిన గుమ్మడికాయల ద్వారకానాథ్ రెడ్డి గురువారం మధ్యాహ్నం బలవన్మరణం చెందాడు. ద్వారకానాథ్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థిక సమస్యలు కానీ, వివాదాలు కానీ లేని ఈ యువకుడి ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడంలేదని బంధువులంటున్నారు. ద్వారకానాథ్ రెడ్డి అమెరికాలో అమెజాన్ సంస్థలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్నాడు. అతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లె.
Go Back to Shorts
USA
Dwarakanath Reddy
Chittoor District
Andhra Pradesh

More Telugu News