Gollapudi: గొల్లపూడి మృతిపై జగన్, చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి

  • గొల్లపూడి సేవలు ప్రశంసనీయం
  • ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి
  • వేర్వేరు ప్రకటనల్లో జగన్, చంద్రబాబు
ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతిపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సంపాదకుడిగా గొల్లపూడి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. గొల్లపూడి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు.

గొల్లపూడి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా తన సంతాపం తెలిపారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, సాహితీ లోకానికి తీరనిలోటని అన్నారు. గొల్లపూడి కుటుంబసభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢసానుభూతి తెలిపారు.
Gollapudi
Maruthirao
cm
Jagan
Chandrababu

More Telugu News