Bhumana: ఏ ఎమ్మెల్యే పిల్లలైనా తెలుగు మీడియంలో చదువుతున్నారా?: భూమన కరుణాకర్ రెడ్డి

  • విద్యా వ్యవస్థకు జగన్ శస్త్ర చికిత్స చేశారు
  • ఇంగ్లీష్ మీడియంపై రాద్ధాంతం చేయడం సరికాదు
  • ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను అందరం ఆహ్వానిద్దాం
రాష్ట్ర విద్యా వ్యవస్థకు ముఖ్యమంత్రి జగన్ శస్త్ర చికిత్స చేశారని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రశంసించారు. సమాజ గతి మారాలంటూ ప్రాథమిక దశ నుంచి ఇంగ్లీష్ మీడియం అవసరమని చెప్పారు. పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్మికుల పిల్లలకు కూడా అత్యున్నత విద్య అందాలనేది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. సాంకేతిక విద్యకు బలహీనవర్గాల పిల్లలు చేరువకావాలనేదే జగన్ లక్ష్యమని తెలిపారు. అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ అవసరాల కోసం ఇంగ్లీష్ మీడియంపై రాద్ధాంతం చేయడం సరికాదని భూమన అన్నారు. శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుతున్నారా? అని ప్రశ్నించారు. మన పిల్లలు చదువుతున్న చదువే అందరూ చదవాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను అందరం ఆహ్వానిద్దామని అన్నారు.
Bhumana
YSRCP
Jagan

More Telugu News