ముగిసిన వాదనలు... 'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ విచారణ
- హైదరాబాద్ లోనే ఉండి దర్యాప్తు
- విచారణ ప్రారంభించిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా నివేదిక
సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఈ జ్యుడీషియల్ కమిటీ విచారణ జరుపుతుందని తెలిపింది. హైదరాబాద్ లోనే ఉండి దర్యాప్తు చేయాలని సూచించింది. ఎన్ కౌంటర్ పై విచారణ ప్రారంభించిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని చెప్పింది. ఈ కమిటీలో జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ తో పాటు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రసాద్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు.