మాయదారి రోగం వచ్చిందని నాటకం ఆడి పెళ్లిని తప్పించుకున్న వరుడు... కటకటాల పాలు!
- డిసెంబర్ 1న జరగాల్సిన పెళ్లి
- తనకు ఎయిడ్స్ సోకిందని అబద్ధమాడిన వరుడు
- ఆపై పోలీసులను ఆశ్రయించిన వధువు కుటుంబీకులు
- అవాస్తవమని తేలడంతో అరెస్ట్
ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. విజయనగర పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ నెల 1వ తేదీన కిరణ్ కు ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. గత చివరి వారంలో అతను వధువు ఇంటికి వచ్చి, తనకు ఎయిడ్స్ సోకిందని చెప్పాడు. వైద్య పరీక్షల పత్రాలు చూపించి బోరుమన్నాడు. ఆపై పెళ్లిని రద్దు చేసుకున్న తరువాత విజయనగర పోలీసులను వధువు కుటుంబీకులు ఆశ్రయించారు. వారు కిరణ్ ను మరోసారి హాస్పిటల్ కు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా, ఎటువంటి మాయదారి రోగమూ లేదని తేలింది. దీంతో మోసం చేశాడన్న ఆరోపణలపై కిరణ్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.