Hyderabad: పెళ్లి కాలేదని యువకుడి మనస్తాపం.. ఉరివేసుకుని ఆత్మహత్య

షార్ట్స్‌లో చూడండి
పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. షారూఖ్‌నగర్ హరాపహాడ్‌కు చెందిన మహ్మద్ షరాఫ్ (26) బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Marriage
suicide

More Telugu News