pslv c-48: పీఎస్ ఎల్వీ సీ-48 విజయవంతమైంది..సంతోషంగా ఉంది: ఇస్రో చైర్మన్ శివన్

  • పీఎస్ఎల్వీకి సంబంధించి ఇది 50వ ప్రయోగం
  • షార్ నుంచి అయితే 75వ ప్రయోగం
  • శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపిన శివన్  

పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం విజయవంతం కావడం సంతోషంగా ఉందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ శివన్ పేర్కొన్నారు. ఈ ప్రయోగం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, పీఎస్ఎల్వీకి సంబంధించి ఇది 50వ ప్రయోగం అని, షార్ నుంచి అయితే 75వ ప్రయోగం అని అన్నారు. 576 కిలోమీటర్ల కక్ష్యలోకి రీశాట్ 2బీఆర్1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఆర్.వి.పెరుమాళ్ సారథ్యంలో ఈ ప్రయోగం నిర్వహించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. కాగా, పీఎస్ఎల్వీ 50 పేరుతో ఓ పుస్తకాన్ని శివన్ విడుదల చేశారు.

More Telugu News