Rajanikanth: రజనీ కొత్త సినిమా లాంచ్ అయింది

  • విడుదలకి సిద్ధమవుతున్న 'దర్బార్'
  • రజనీ 168వ సినిమాకి సన్నాహాలు 
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్

రజనీకాంత్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసుకువెళుతూ, యువ కథానాయకులతో పోటీ పడుతున్నారు. ఒక వైపున ఆయన 'దర్బార్' విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో వైపున తదుపరి సినిమాకి సన్నాహాలను పూర్తి చేస్తూ వచ్చారు. శివ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఈ సినిమాలో రజనీ సరసన కీర్తి సురేశ్ కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. ఖుష్బూ .. మీనా నటించనున్నారు. కెరియర్ పరంగా రజనీకి ఇది 168వ సినిమా. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా, జనవరి 3వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అజిత్ కి వరుస విజయాలను అందిస్తూ వచ్చిన శివ, రజనీకి ఏ స్థాయి హిట్ ను ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

More Telugu News