2002 నాటి హత్యాకాండ కేసులో మోదీకి క్లీన్ చిట్
- మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన నానావతి కమిషన్
- ఐదేళ్ల క్రితమే తుది నివేదికను సమర్పించిన కమిషన్
- ఈ రోజు అసెంబ్లీ ముందుకు వచ్చిన నివేదిక
2002 ఫిబ్రవరి 27న గోద్రాలో సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలుకు కొందరు దుండగులు నిప్పంటించడంతో 59 మంది హిందువులు చనిపోయారు. దీంతో, మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. వీరిలో అత్యధికులు ముస్లింలు. ఈ అల్లర్లపై విచారణకు కమిషన్ ను 2002లోనే అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ వేశారు.
మూడు రోజుల పాటు కొనసాగిన హింసను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని కమిషన్ తన నివేదికలో అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో గుంపులను పోలీసులు అడ్డుకోలేకపోయారని వెల్లడించింది. అల్లర్లను నియంత్రించలేకపోయిన పోలీసు అధికారులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సూచించింది.