దేశవ్యాప్తంగా మరింత పెరిగిన ఉల్లి ధరలు
- పనాజీలో కిలో ఉల్లి రూ.165
- కోల్కతా, బెంగళూరుల్లో రూ.140
- దేశంలోని 14 ప్రధాన నగరాల్లో రూ.100
మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఉల్లి దిగుబడి తగ్గి కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులను నిలిపేసింది. అంతేగాక, పెద్ద ఎత్తున ఉల్లిని దిగుమతి చేసుకునే ఏర్పాట్లు చేసింది.