Akbaruddin Owaisi: నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఒవైసీ

  • 2012లో నిర్మల్ లో బహిరంగ సభలో మాట్లాడిన అక్బరుద్దీన్ 
  • వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు
  • విచారణకు హాజరైన ఒవైసీ
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నిర్మల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. 2012లో నిర్మల్ లో తమ పార్టీ నిర్వహించిన ఓ బహిరంగ సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ  చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిర్మల్ కోర్టులో కొనసాగుతోంది.

ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ప్రసంగించారని ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయన విచారణకు హాజరవుతున్నారు. నిర్మల్ లోని కోర్టుకు పోలీసుల భద్రత మధ్య వచ్చిన ఆయన విచారణ అనంతరం అక్కడి నుంచి వెళ్లారు.
Akbaruddin Owaisi
Hyderabad
Nirmal District

More Telugu News