Kotamreddy: అసెంబ్లీలో అస్వస్థతకు గురైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  • బీపీ పెరగడంతో అస్వస్థతకు గురైన కోటంరెడ్డి
  • ప్రాథమిక చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించిన వైద్యులు
  • ప్రస్తుతం నిలకడగా ఉన్న ఆరోగ్యం
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కోటంరెడ్డి హాజరయ్యారు. సభ కొనసాగుతున్న సమయంలో బీపీ లెవెల్స్ పెరగడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. వెంటనే సభ నుంచి బయటకు వచ్చి, వైయస్సార్సీపీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు.

వైద్యులు అక్కడకు వచ్చి ఆయనను పరీక్షించి, ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి... కోటంరెడ్డి ఆరోగ్యంపై వాకబు చేశారు. కోటంరెడ్డి బీపీ వల్ల అస్వస్థతకు గురయ్యారని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడంలో సభలోని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Kotamreddy
YSRCP

More Telugu News