Citizenship Amendment Bill: లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా.. వ్యతిరేకించాలంటూ టీఆర్ఎస్ విప్ జారీ

  • ఈ బిల్లు ఏ వర్గానికీ వ్యతిరేకం కాదన్న అమిత్ షా
  • మైనార్టీలకు 0.001 శాతం కూడా ఈ బిల్లు వ్యతిరేకం కాదు
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా

మరో కీలకమైన బిల్లును ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ బిల్లు ఏ ఒక్క వర్గానికీ వ్యతిరేకం కాదని అన్నారు. దేశంలోని మైనార్టీలకు 0.001 శాతం కూడా ఈ బిల్లు వ్యతిరేకం కాదని తెలిపారు. బిల్లుకు సంబంధించి సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సభ నుంచి ఏ పార్టీ కూడా వాకౌట్ చేయవద్దని కోరారు. మరోవైపు, ఈ బిల్లును వ్యతిరేకించాలంటూ తమ ఎంపీలకు టీఆర్ఎస్ విప్ జారీ చేసింది.

More Telugu News