దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: సుప్రీంకోర్టులో పిటిషనర్ జీఎస్ మణి
- ఎన్ కౌంటర్ పై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ప్రస్తావన
- అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరిన పిటిషనర్ జీఎస్ మణి
- సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పాటించలేదని పేర్కొన్న పిటిషనర్
అయితే, ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఈ అంశంపై విచారణ చేస్తోందని సీజేఐ బోబ్డే అన్నారు. జీఎస్ మణి పిటిషన్ పై ఈ నెల 11న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.