New Delhi: ఢిల్లీలో నిన్న ప్రమాదం జరిగిన భవనంలోనే మరోమారు అగ్నిప్రమాదం

  • నిన్నటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 43 మంది
  • మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్

ఢిల్లీలో నిన్న తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిన భవనంలోనే నేడు మరోమారు మంటలు చెలరేగాయి. రాణిఝాన్సీ రోడ్డులోని అనాజ్‌మండిలో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. కాగా, తాజాగా చెలరేగిన మంటలను నాలుగు అగ్నిమాపక శకటాలతో అదుపు చేస్తున్నారు.

నిన్నటి ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కేంద్రం మరో రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కాగా, ఘటన తర్వాత పరారైన భవనం యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News