sai praneeth: లక్ష్మీశ్వేతను పెళ్లాడిన షట్లర్ సాయిప్రణీత్

  • కాకినాడలో జరిగిన వివాహం
  • హాజరైన పలువురు ప్రముఖులు
  • నేడు హైదరాబాద్‌లో రిసెప్షన్

ప్రముఖ షట్లర్, బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌ వివాహం కాకినాడలో నిన్న ఘనంగా జరిగింది. పట్టణానికి చెందిన జయంతి శ్రీనివాస్-సత్యశ్రీ దంపతుల కుమార్తె లక్ష్మీశ్వేతను సాయిప్రణీత్ వివాహం చేసుకున్నాడు. డబుల్స్‌ ఆటగాడు సాత్విక్‌ సాయిరాజ్‌ సహా పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా, నేడు హైదరాబాద్‌లో వివాహ రిసెప్షన్‌ జరగనుంది.

More Telugu News